For Money

Business News

నిఫ్టి… అదేమిటి అలా పడింది…?

అమ్మినవాడు అదృష్టవంతుడు. నిఫ్టి మరోసారి 17,400 స్థాయిని నిలుపుకోవడంలో విఫలమైంది. ఉదయం ఆరంభంలో రికార్డు లాభాలతో ప్రారంభమైన నిఫ్టి మిడ్‌ సెషన్‌ తరవాత వాటిని కోల్పోయింది. ఒకదశలో 17,639 పాయింట్లను తాకిన నిఫ్టి చివర్లలో 17,355ని తాకింది. అంటే ఏకంగా 300 పాయింట్లు పడింది. క్రితం ముగింపుతో పోలిస్తే 143 పాయింట్ల నష్టంతో 17,368 పాయింట్ల వద్ద ముగిసింది. ఇవాళ దాదాపు అన్ని సూచీలు నష్టపోవడం విశేషం. సాధారణంగా నిఫ్టికి భిన్నంగా కాస్త బలంగా ఉండే మిడ్‌ క్యాప్‌ నిఫ్టి కూడా నష్టాల్లో ముగిసింది. నిఫ్టిలో 35 షేర్లు నష్టాల్లో ముగిశాయి. బజాజ్‌ ఫైనాన్స్‌పై అనేక రేటింగ్‌ సంస్థలు నెగిటివ్‌ రిపోర్టులు ఇచ్చాయి. జనం కొనుగోళ్ళు తగ్గించారని, మార్జిన్లు కూడా తగ్గుతున్నాయని… ఈ లెక్కన రూ. 6000 టార్గెట్‌గా బజాజ్‌ ఫైనాన్స్‌ను అమ్మవచ్చని సలహా ఇచ్చారు. ఇవాళ ఈ షేర్‌ 3 శాతం నష్టంతో రూ.7,230 వద్ద ముగిసింది.