For Money

Business News

17800 దిగువన నిఫ్టి

సింగపూర్ నిఫ్టికి సమానంగా నిఫ్టి కూడా వంద పాయింట్లకు పైగా నష్టంతో ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 17763ని తాకిన నిఫ్టి ఇపుడు 17766ని తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 111 పాయింట్ల నష్టంతో ఉంది. సెన్సెక్స్‌ కూడా 320 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. నాస్‌డాక్‌కు అనుగుణంగా ఐటీ షేర్లలో పతనం ఇవాళ కూడా కొనసాగింది. టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, విప్రో షేర్లు టాప్‌ ఫైవ్‌ లూజర్స్‌లో ఉన్నాయి. నిఫ్టిలో 40 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. కేవలం పది షేర్లు లాభాల్లో ఉన్నా.. అవి కూడా నామ మాత్రపు లాభాల్లో ఉన్నాయి. అన్ని సూచీలు నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టి నెక్ట్స్‌ కూడా ఇవాళ అర శాతంపైగా నష్టపోవడం విశేషం. అదానీ ట్రాన్స్‌మిషన్‌ ఇవాళ కూడా గ్రీన్‌లో ఉంది. అయితే గత రెండు ట్రేడింగ్‌ సెషన్స్‌లో 13 శాతంపైగా పెరిగిన వేదాంత ఇవాళ అయిదు నష్టంతో ఉంది. దీనికి ప్రధాన కారణంగా గుజరాత్‌లో నెలకొల్పే డేటా సెంటర్‌ వేదాంతలో భాగం కాదని ప్రమోటర్లు తెలిపారు. దీంతో ఇన్వెస్టర్లు షాక్‌ తిన్నారు. క్రూడ్‌ ధరలు తగ్గడంతో పెయింట్‌ షేర్లతో పాటు టైర్లు షేర్లు లాభాల్లో ఉన్నాయి.