For Money

Business News

స్థిరంగా ప్రారంభమైనా…

నిఫ్టి గ్రీన్‌లో ప్రారంభమైనా.. కొన్ని నిమిషాల్లోనే రెడ్‌ జోన్‌లోకి వచ్చేసింది. ఓపెనింగ్‌లో 16763 పాయింట్లను తాకిన నిఫ్టి ఇపుడు 16764 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 54 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. ఓపెనింగ్‌లోనే బ్యాంక్‌, ఐటీ షేర్ల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తోంది. నిన్న రాత్రి అమెరికా నాస్‌డాక్‌ దాదాపు మూడు శాతం క్షీణించిన విషయం తెలిసిందే.పైగా డాలర్ బలహీనపడింది. దీంతో ఐటీ షేర్లు కళ తప్పాయి. ఇక నిఫ్టి బ్యాంక్‌లో ఒత్తిడి కొనసాగుతోంది. నిఫ్టి 30 షేర్లు రెడ్‌లో ఉన్నాయి. మరికాస్సేపట్లో క్రెడిట్‌పాలసీ రానుంది. ఈ నేపథ్యంలో బ్యాంక్‌ షేర్లలో ఒత్తిడి వస్తోంది. పాలసీ ఏమాత్రం పాజిటివ్‌గా ఉన్న బ్యాంకు షేర్లకు మద్దతు లభించవచ్చు. కాని అలాంటి అవకాశం లేదనిన అనలిస్టులు అంటున్నారు. డాలర్‌ క్షీణించడంతో మెటల్స్‌ కాస్త వెలుగులో ఉన్నాయి. బ్రోకరేజీ రిపోర్ట్‌ పాజిటివ్‌గా రావడంతో హిందాల్కో ఇవాళ కూడా మూడు శాతం దాకా పెరిగింది. ఇవాళ్టి నుంచి నిఫ్టిలో అదానీ ఎంటర్‌ప్రైజస్‌ ట్రేడవుతోంది. ప్రస్తుతం ఈ షేర్‌ అర శాతం లాభంతో ఉంది. సిమెంట్‌ షేర్లు ఇవాళ వెలుగులో ఉన్నాయి. ఇండియా సిమెంట్‌ను కొందరు అనలిస్టులు రెకమెండ్‌ చేస్తున్నారు. రైట్స్‌ ఇష్యూపై హెరిటేజ్‌ ఇండస్ట్రీస్‌ ఇవాళ నిర్ణయం తీసుకోనుంది.