150 పాయింట్ల నష్టం…
అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూలతల కారణంగా మన మార్కెట్లలో కూడా అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి దాదాపు కార్పొరేట్ ఫలితాలు పూర్తయ్యాయి. దీంతో మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలు పెద్దగా లేవు. ఉదయం నుంచి నష్టాల్లోనే కొనసాగుతోంది. మిడ్ సెషన్లో స్వల్పంగా పెరిగినట్లు కన్పించినా… మళ్ళీ డౌన్ ట్రెండ్ కొనసాగుతోంది. నిఫ్టి ప్రస్తుతం 18158 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే 150 పాయింట్ల నష్టంతో ఉంది. కేంద్రం స్టీల్ ఉత్పత్తులపై సుంకాలను ఎత్తివేయడంతో మెటల్స్ పెరిగినా… చైనాలో కరోన కారణంగా మళ్ళీ నష్టాల్లోకి జారకున్నాయి. చాలా రోజుల తరవాత అదానీ షేర్లలో ఒత్తిడి కన్పిస్తోంది. అలాగే జొమాటో, నైకా షేర్లు కూడా మూడు శాతంపైగా నష్టంతో ఉన్నాయి. మిడ్ క్యాప్లోకొన్ని షేర్లు ఆకర్షణీయ లాభాలు ఆర్జించాయి. శుక్రవారం అమెరికా మార్కెట్లకు సెలవు. అయితే గురువారం ఫెడ్ గత మీటింగ్స్ మినిట్స్ బయటకు రానున్నాయి. ఈవారం వీక్లీ, నెలవారీ డెరివేటివ్స్ క్లోజింగ్ ఉన్నందున ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో ట్రేడింగ్ జోరుగా ఉంది.