For Money

Business News

సూపర్‌ లిస్టింగ్‌

ఇవాళ రెండు షేర్లు లిస్టయ్యాయి. అందులో ఆర్కియాన్‌ కెమికల్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ రూ. 450 వద్ద లిస్టయింది. అంటే పది శాతంపైగా ప్రీమియం లభించిందన్నమాట. ఈ షేర్‌ను కంపెనీ రూ. 407 వద్ద ఆఫర్‌ చేసింది. రూ. 476ను తాకిన తరవాత ఎన్‌ఎస్‌ఈలో ఈ షేర్‌ రూ. 447 వద్ద ట్రడేవుతోంది. ఈ పబ్లిక్‌ ఆఫర్‌ 32 రెట్లు ఓవర్‌ సబ్‌ స్క్రయిబ్‌ అయింది. లిస్టింగ్‌ లాభాలతో పాటు దీర్ఘ కాలంలో ఈ షేర్‌ మంచి ప్రతిఫలాలు ఇస్తుందని అనలిస్టులు సిఫారసు చేస్తున్నారు.
డిస్కౌంట్‌కు లిస్టయినా…
ఫైవ్‌ స్టార్‌ బిజినెస్‌ ఫైనాన్స్‌ షేర్‌ ఇవాళ డిస్కౌంట్‌తో లిస్టయింది. ఈ షేర్‌ ఇష్యూ ధర రూ. 474 కాగా, ఎన్‌ఎస్‌ఈలో ఈ షేర్‌ రూ. 468.80 వద్ద డిస్కౌంట్‌తో లిస్టయింది. వెంటనే రూ. 448కి పడిపోయింది. కాని.. దిగువ స్థాయిలో మద్దతు అందడంతో ఈ షేర్‌ కొద్దిసేపట్లోనే రూ. 537కు చేరింది. అంటే దాదాపు 15 శాతం లిస్టింగ్‌ లాభాలు అన్నమాట. ఇపుడు ఎన్‌ఎస్‌ఈలో ఈ షేర్‌ రూ. 531 వద్ద 12 శాతం లాభంతో ట్రేడవుతోంది.