For Money

Business News

నిఫ్టికి అవే నష్టాలు

ఉదయం అర గంటలోనే నిఫ్టి భారీగా నష్టపోయింది. దాదాపు 150 పాయింట్లు నష్టపోయి 18133ని తాకింది. మిడ్‌ సెషన్‌ తరవాత కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. యూరో మార్కెట్లు మిశ్రమంగా ఉన్నా… మన మార్కెట్లు 0.81 శాతం నష్టంతో ముగియడం విశేషం. క్రితం ముగింపుతో పోలిస్తే 148 పాయింట్ల నష్టంతో నిఫ్టి 18159 పాయింట్ల వద్ద ముగిసింది. 18150 స్థాయిని కాపాడుకోవడం ఒక్కటే ఇవాళ కాస్త ఊరటనిచ్చే అంశం. ఇతర సూచీలతో పోలిస్తే నిఫ్టిలోనే అధిక ఒత్తిడి కన్పించింది. ప్రధాన సూచీలు మిడ్‌ సెషన్‌ తరవాత చాలా వరకు రికవర్‌ అయ్యాయి. నిఫ్టి మిడ్‌ క్యాప్‌ సూచీ కేవలం 0.15 శాతం నష్టపోగా, నిఫ్టి బ్యాంక్‌ కూడా కేవలం 0.21 శాతం నష్టంతో ముగిసింది. ఇవాళ పలు అదానీ గ్రూప్‌ షేర్లు నష్టాల్లో ముగియడం విశేషం. అదానీ పోర్ట్స్‌ రెండు శాతంపైగా నష్టపోయి నిఫ్టి టాప్‌ లూజర్‌గా నిలిచింది. అదానీ ఎంటర్‌ప్రైజస్‌ అరశాతం తగ్గింది. అయితే అదానీ ట్రాన్స్‌ మిషన్‌, అదానీ గ్రీన్‌ షేర్లు మూడు శాతంపైగా నష్టపోయాయి. అదానీ విల్మర్‌ గుజరాత్‌ అంబుజా కూడా నష్టాలతో ముగిసింది.