For Money

Business News

ఓపెనింగ్‌లోనే 18,000 దాటిన నిఫ్టి

నిఫ్టి ఓపెనింగ్‌లోనే 18,000ను దాటి 18,012ను చేరడం.. ఆ వెంటనే 17,947ను తాకడం కూడా పూర్తయింది. అంటే ప్రతిఘటన స్థాయితో పాటు మద్దతు స్థాయిని తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే 32 పాయింట్ల లాభంతో 17961 వద్ద ఇపుడు ట్రేడవుతోంది. నిఫ్టి మిడ్‌ క్యాప్‌ మినహా మిగిలిన సూచీలు గ్రీన్‌లో ఉన్నా… బలంగా మాత్రం లేవు. రాత్రి అమెరికా మార్కెట్‌లో 6 శాతంపైగా పెరిగిన టాటా మోటార్స్‌ మన మార్కెట్‌లో ప్రస్తుతం 3 శాతం లాభంతో ట్రేడవుతోంది. మారుతీ కూడా 2 శాతంపైగా పెరగడం విశేషం. డాలర్‌ బలంగా ఉండటంతో మెటల్స్‌పై ప్రభావం చూపుతోంది. ఇన్వెస్టర్ల డార్లింగ్‌ ఐఆర్‌సీటీసీ ఇపుడు ఎందుకో కళ తప్పినట్లు కన్పిస్తోంది. లిక్విడిటీ పెరగడంతో షేర్‌పై ఆసక్తి తగ్గింది. టాటా పవర్‌ మళ్ళీ పెరుగుతోంది. ఇక నిఫ్టిలో 40 షేర్లు గ్రీన్‌లో ఉన్నా…చాలా వరకు నామ మాత్రపు లాభాలే. మిడ్‌ సెషన్‌లో నిఫ్టి 18,000ని బలంగా దాటుతుందా అనేది చూడాలి. ఎందుకంటే టెన్నికల్స్‌ వీక్‌గా ఉన్నాయి. మార్కెట్‌ మూడ్‌ దీనికి భిన్నంగా ఉంది.