భారీ నష్టాల్లో ముగిసిన నిఫ్టి
ఆసియా, యూరప్ మార్కెట్లతో పోలిస్తే
మన మార్కెట్లు కేవలం 0.96 శాతం నష్టంతో బయటపడ్డాయంటే గొప్పే. స్మాల్ క్యాప్ షేర్లలో ఇంకా అమ్మకాల ఒత్తిడి రాలేదు. బ్యాంక్ నిఫ్టిలో మాత్రం ఒక మోస్తరు అమ్మకాలు సాగాయి. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 0.96 శాతం నష్టంతో 151 పాయింట్ల నష్టంతో 15,727 పాయింట్ల వద్ద ముగిసింది. సో నిఫ్టి మళ్ళీ బేర్ జోన్లోకి వస్తోందా అన్న అనిపిస్తోంది. 15,885 పాయింట్ల స్థాయిని తాకిన నిఫ్టి… 15682 పాయింట్ల స్థాయిని తాకింది. అంటే ఒకే సెషన్లో 200 పాయింట్లకు పైగా పడింది. టాటా మోటార్స్‌లో ఇవాళ కూడా అమ్మాకాలు కొనసాగాయి. మెటల్స్ షేర్లలో భారీ అమ్మకాలు వచ్చాయి. అమెరికా ఫ్యూచర్స్ ఇపుడు ఒకటిన్నర శాతం నష్టంతో ఉన్నాయి.
నిఫ్టి టాప్ గెయినర్స్
టెక్ మహీంద్రా 1,060.40 1.39
ఎస్బీఐ లైఫ్ 1,023.45 0.89
ఐషర్ మోటార్స్ 2,732.00 0.78
బజాజ్ ఆటో 4,073.00 0.61
హెచ్‌సీఎల్ టెక్ 976.40 0.11
నిఫ్టి టాప్ లూజర్స్
టాటా మోటార్స్ 306.15 -3.45
JSW స్టీల్ 668.80 -3.13
హిందాల్కో 382.85 -2.74
టాటా స్టీల్ 1,190.00 -2.35
ఓఎన్జీసీ 117.10 -2.34