For Money

Business News

నష్టాలతో ప్రారంభం కానున్న నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లతో పోలిస్తే మన మార్కెట్లు నిన్న ఒక మోస్తరు లాభాలతో ముగిశాయనే చెప్పాలి.నిన్న యూరో మార్కెట్లు రెండు శాతం దాకా నష్టపోయాయి. రాత్రి అమెరికా కూడా అదే స్థాయి నష్టాలతో ప్రారంభమైనా… క్లోజింగ్‌ కల్లా కోలుకున్నాయి. అయినా దాదాపు ఒక శాతం నష్టంతో ముగిశాయి. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు ఇవాళ కూడా భారీ నష్టాల్లో ఉన్నాయి. చైనా కంపెనీలపై అమెరికా తాజా ఆంక్షలు విధిస్తోంది. చైనా కూడా క్రిప్టో కరెన్సీలపై తన దాడి పెంచింది. పైగా కరోనా డెల్టా విస్తరిస్తోంది. దీంతో మార్కెట్లపై ఒత్తిడి పెరిగింది. సింగపూర్ నిఫ్టి 40 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టి కూడా నష్టంతో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.