For Money

Business News

నిఫ్టి: డే ట్రేడర్లకు కనకవర్షం

చాలా రోజుల తరవాత డే ట్రేడర్స్‌కు భారీ లాభాలు వచ్చిన రోజు ఇవాళ. నిఫ్టి పూర్తిగా ఆల్గో ట్రేడింగ్‌కు అనుగుణంగా కనిష్ఠ, గరిష్ఠ స్థాయిలను తాకడంతో ఇరువైపులా డే ట్రేడర్స్‌ సంపాదించారు. నిఫ్టి ఇవాళ కనిష్ఠ స్థాయి 17300, గరిష్ఠ స్థాయి 17450గా టెక్నికల్‌ అనలిస్టులు అంచనా వేశారు. చాలా మంది గరిష్ఠ స్థాయిని 17,430గా నిర్ణయించారు. ఇవాళ ఉదయం నిఫ్టి ఆరంభమైన గంటలోపే కనిష్ఠ స్థాయి 17,287ని తాకింది. అక్కడి నుంచి కోలుకున్న నిఫ్టి మిడ్‌ సెషన్‌లో ఏకంగా 17,436 పాయింట్లకు అంటే 150 పాయింట్లు పెరిగింది. అయితే చివర్లో వచ్చిన స్వల్ప ఒత్తిడి కారణంగా 16 పాయింట్ల నష్టంతో 17,362 వద్ద ముగిసింది. బ్యాంక్‌ నిఫ్టి బలహీనంగా ఉండటంతో చివర్లో నిఫ్టి నిలబడలేకపోయింది. మిడ్‌ క్యాప్‌ సూచీ కూడా స్వల్ప లాభాలకే పరిమితమైంది. గత రెండు రోజులుగా మార్కెట్‌కు అండగా నిలిచిన రిలయన్స్‌ ఇవాళ నీరసడిపోయింది. గ్రీన్‌లో ఉన్నా పెద్ద లాభాల్లేవ్‌.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
భారతీ ఎయిర్‌టెల్‌ 671.75 2.62
హెచ్‌డీఎఫ్‌సీ 2,833.20 2.46
గ్రాసిం 1,555.10 1.57
ఐటీసీ 211.85 1.22
ఇండస్‌ ఇండ్‌ 1,001.85 1.00

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
సన్‌ ఫార్మా 767.30 -2.16
బీపీసీఎల్‌ 481.75 -1.84 హిందాల్కో 461.00 -1.76
యాక్సిస్‌ బ్యాంక్‌ 787.60 -1.65
విప్రో 675.25 -1.63