For Money

Business News

సబ్సుల ధరలను 14% దాకా పెంచిన HUL

హిందుస్థాన్‌ యూనీ లీవర్‌ తన ఉత్పత్తుల ధరలను పెంచింది. ముడి వస్తువల ధరలు పెరిగినందునే తమ ఉత్పత్తుల ధరలను పెంచుతున్నట్లు కంపెనీ పేర్కొంది. సబ్బుల ధరల పెరుగుదల 3.5 శాతం నుంచి 14 శాతం దాకా ఉంది. చిత్రమేమిటంటే.. చిన్న ప్యాకెట్ల వస్తువుల ధరలను పెంచలేదు కాని… అందులో బరువును తగ్గించింది. వీల్‌ పౌడర్‌ ధరను 3.5 శాతం పెంచడంతో కిలో, 500 గ్రాముల ప్యాక్‌ ధర రూ. 1 నుంచి రూ. 2 దాకా పెరిగింది. సర్ఫ్‌ ఎక్సెల్‌ (ఈజీ వాష్‌ వేరియంట్‌) ధర రూ. 100 నుంచి రూ. 114కు పెంచింది. ఇక రిన్‌ పౌడర్‌ కిలో ధర రూ.77 నుంచి రూ. 82లకు పెరగ్గా, 500 గ్రాముల ప్యాక్‌ ధర రూ. 37 నుంచి రూ. 40కి పెంచింది. ఇక లక్స్‌ సబ్సు ధర 8 నుంచి 12 శాతం పెంచినట్లు కంపెనీ వెల్లడించింది. ఇక లైఫ్‌బాయ్‌ సబ్సు ధర కూడా 8 శాతం పెంచినట్లు పేర్కొంది. విమ్‌ బార్‌ ధర రూ. 20 నుంచి రూ. 22కు పెంచింది. ఆగస్టు నెల నుంచి కంపెనీ తన ఉత్పత్తుల ధరలను విడతలవారీగా పెంచుతూ వస్తోంది. వెరశి మొత్తం ఉత్పత్తుల ధరలు పెంచింది. సాధ్యం కాని చిన్న సాచెట్ల విషయంలో బరువు తగ్గించింది.