స్థిరంగా ముగిసిన నిఫ్టి
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ఎలాంటి సానుకూలతలు లేకపోవడం… ముఖ్యంగా యూరో మార్కెట్లు దాదాపు అర శాతంపైగా నష్టంతో క్లోజ్ కావడంతో… నిఫ్టి 18,409 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే 6 పాయింట్లు లాభపడింది. సూచీలు ఇవాళ హెచ్చుతగ్గులకు లోనైనా… మార్పులు మాత్రం పెద్దలేవు. ఇవాళ కూడా వంద పాయింట్లు అటూ ఇటూ కదలాడింది నిఫ్టి. బ్యాంక్ నిఫ్టి మాత్రం 0.38 శాతం చొప్పున లాభపడింది. కొటక్ బ్యాంక్ రెండున్నర శాతం లాభపడింది. అదానీ పోర్ట్స్; అపోలో హాస్పిటల్స్, హిందాల్కో వంటి కౌంటర్లలో ఒత్తిడి వచ్చింది. మిడ్ క్యాప్, నిఫ్టి నెక్ట్స్లలో కాస్త ఒత్తిడి కన్పించింది. నైకాతో పాటు పేటీఎం కూడా ఇవాళ 5 శాతం క్షీణించింది. హెచ్ఏఎల్ చాలా రోజుల తరవాత మళ్ళీ 6 శాతం పెరిగింది. అరబిందో ఫార్మా క్రమంగా మళ్ళీ క్షీణిస్తూ వస్తోంది. ఇవాళ మూడు శాతంపైగా క్షీణించి రూ.477 వద్ద ట్రేడవుతోంది.