For Money

Business News

మేదాంత సూపర్‌ లిస్టింగ్‌

మేదాంత హాస్పిటల్స్‌ను నిర్వహించే గ్లోబల్‌ హెల్త్‌ లిమిటెడ్‌ షేర్లు ఏకంగా 20 శాతంపైగా లాభంతో లిస్టయ్యాయి. ఈ షేర్‌ను కంపెనీ రూ. 336లకు ఇన్వెస్టర్లకు ఆఫర్‌ చేసింది. మార్కెట్‌ స్థిరంగా ఉన్నా లిస్టింగ్‌ తరవాత ఈ షేర్‌ రూ.410ను తాకి… ఇపుడు రూ. 399 వద్ద ట్రేడవుతోంది. ఈ షేర్‌ దీర్ఘకాలంలో కూడా మంచి ప్రతిఫలాన్ని ఇస్తుందని.. షార్ట్‌ టర్మ్‌ కోసం ఇన్వెస్ట్‌ చేసినవారు ఇవాళ లాభాలు స్వీకరించవచ్చని అనలిస్టులు సూచించారు. అపోలో హాస్పిటల్స్‌, రెయిన్‌ బో హాస్పిటల్స్‌ కూడా నిన్నటి నుంచి లాభాల్లో ఉన్నాయి. గ్రే మార్కెట్‌లో ఈ షేర్‌ రూ.75 ప్రీమియంతో ట్రేడవగా.. షేర్‌ రూ. 410కి చేరింది. కంపెనీ పనితీరు బాగా ఉన్నందున ఇన్వెస్టర్లు ఈ షేర్లను కొనసాగించుకోవచ్చని ఏయూఎం క్యాపిటల్‌కు చెందిన రాజేష్‌ అగర్వాల్‌ అన్నారు.