For Money

Business News

వీక్లీ సెటిల్‌మెంట్‌ ఎఫెక్ట్‌

ఇవాళ వీక్లీ సెటిల్‌మెంట్‌ కారణంగా ఉదయం పది గంటలకు వచ్చిన షార్ట్‌ కవరింగ్‌ చివర్లో లోపించింది. సరిగ్గా మూడు గంటలకు నిఫ్టి జోరుగా పతనమై 18350 దిగువకు చేరింది. ఒకదశలో 18312ను తాకిన నిఫ్టి స్వల్పంగా కోలుకుని 18343 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లు ఒక్కసారిగా నష్టాల్లోకి జారుకోవడంతో చాలా మంది ఇన్వెస్టర్లు షార్ట్‌ పొజిషన్స్‌కు మొగ్గు చూపారు. యూరో మార్కెట్ ఆరంభంలో అర శాతంపైగా లాభం ఉండగా… మూడు గంటల ప్రాంతంలో అన్ని మార్కెట్లు నష్టాల్ల్లోకి జారుకున్నాయి. అలాగే అమెరికా ఫ్యూచర్స్‌ కూడా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టితో పాటు ఇతర ప్రధాన సూచీలు నష్టాల్లో ఉన్నా.. నిఫ్టి నెక్ట్స్‌ 0.75 శాతంతో ముగిసింది. దీనికి కారణం పేటీఎం, నౌకరి, అదానీ ట్రాన్స్‌ భారీ నష్టాల్లో క్లోజ్‌ కావడమే. నిఫ్టిలో 37 షేర్లు నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా టైటాన్‌, ఎం అండ్‌ ఎం, టాటా మోటార్స్‌ షేర్లు 2 శాతం పైగా నష్టంతో ముగిశాయి.