మళ్ళీ 15,800 దిగువకు నిఫ్టి
స్టాక్ మార్కెట్లో 2 నుంచి 2.20 గంటల మధ్య నిఫ్టి అనేక సార్లు కీలక మలుపు తీసుకుంటుంది. ఉదయం నుంచి లాభాల్లో విహరించిన నిఫ్టి చివరికి నష్టాల్లో ముగిసింది. దాదాపు ఆసియాలోని అన్ని మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. యూరప్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. మధ్యాహ్నం 2.20 గంటల వరకు భారీ లాభాల్లో ఉన్న నిఫ్టి… సరిగ్గా స్క్వేర్ ఆఫ్ సమయానికి నష్టాల్లోకి వచ్చేసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 15 పాయింట్ల నష్టంతో 15,763 పాయింట్ల వద్ద ముగిసింది. కాని గరిష్ఠ స్థాయిని నుంచి సరిగ్గా వంద పాయింట్లు కోల్పోయింది. అదే ఉదయం కనిష్ఠ స్థాయిలో కొనుగోలు చేసినవారికీ 120 పాయింట్లు లాభం తెచ్చి పెట్టింది. ఆల్గో ట్రేడింగ్ చేసే ఇన్వెస్టర్లకు ఇవాళ రెండు వైపుల లాభాలు వచ్చాయి. ఆల్గో ట్రేడింగ్‌కు ఇవాళ టెక్నికల్స్- 15740 నుంచి 15,838. రెండు స్థాయిలను నిఫ్టి ఇవాళ తాకింది నిఫ్టి. బ్యాంక్ నిఫ్టి ఇవాళ రెడ్‌లో ముగిసింది. నిఫ్టి నష్టాల్లో ముగిసినా.. మిడ్ క్యాప్ సూచీ మాత్రం 1.4 శాతం లాభాలతో ముగియడం విశేషం.
నిఫ్టి టాప్ గెయినర్స్
సన్ ఫార్మా 773.55 10.04
టెక్ మహీంద్రా 1,207.70 7.08
సిప్లా 920.55 4.24
అదానీ పోర్ట్స్ 675.00 2.33
శ్రీసిమెంట్ 28,250.00 2.21
నిఫ్టి టాప్ లూజర్స్
బజాజ్ ఫైనాన్స్ 6,231.95 -2.63
బజాజ్ ఫిన్ సర్వ్ 14,240.00 -2.46
హిందాల్కో 447.80 -2.25
ఎస్బీఐ 432.20 -2.12
యూపీఎల్ 805.00 -1.79