For Money

Business News

92 % పెరిగిన టాటా మోటార్స్‌ సేల్స్‌

జులై నెలలో టాటా మోటార్స్‌ అద్భుత పనితీరు కనబర్చింది. గత ఏడాది జులైతో పోలిస్తే ఈ నెలలో కంపెనీ అమ్మకాలు 92 శాతం పెరిగి 51,981 వాహనాలకు పెరిగాయి. గత ఏడాది కంపెనీ ఇదే నెలలో 27,024 వాహనాలు అమ్మింది. ఈ ఏడాది జులైలో 30,185 ప్యాసింజర్‌ వెహికల్స్‌, 21,796 కమర్షియల్‌ వెహికల్స్‌ అమ్మినట్లు టాటా మోటార్స్‌ పేర్కొంది.
మారుతీ 50 శాతం
ఈ ఏడాది జులై నెలలో మారుతీ సుజుకీ ఇండియా 1,62,462 వాహనాలను విక్రయించింది. గత ఏడాది జులైతో పోలిస్తే ఇది 50 శాతం అధికం. గత ఏడాది జులైలో కంపెనీ 1,08,064 వాహనాలను విక్రయించింది. దేశీయంగా అమ్మకాలు 39 శాతం పెరిగాయి. ఎగుమతులు 6,757 వాహనాల నుంచి 21,224 వాహనాలకు పెరిగాయి.