For Money

Business News

బలహీనంగా ముగిసిన నిఫ్టి

ఉదయం అంచనా వేసిన ఆల్గో లెవల్స్‌కు లోబడి ఇవాళ నిఫ్టి కదలాడింది. ఉదయం 17,379 పాయింట్ల గరిష్ఠ స్థాయికి చేరిన నిఫ్టి తరవాత మిడ్‌ సెషన్‌కల్లా నష్టాల్లోకి జారుకుంది. అక్కడి నుంచి కోలుకున్నా… చివరల్లో మళ్ళీ నష్టాల్లోకి జారుకుని ఇవాళ్టి కనిష్ఠ స్థాయి 17,184ని తాకింది. క్లోజింగ్‌కు ముందు కోలుకుని 17,248 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే 27 పాయింట్లు లాభపడింది. కేవలం వీక్లీ డెరివేటివ్స్‌ ముగింపు కారణంగానే సూచీ పెరిగినట్లు కన్పిస్తోంది. ఎందుకంటే మార్కెట్‌లోని ఇతర ప్రధాన సూచీలు గ్రీన్‌లో క్లోజ్‌ కాలేదు. కీలక మిడ్‌ క్యాప్‌ నిఫ్టి సూచీ 0.4 శాతం క్లోజ్‌ కాగా, బ్యాంక్‌ నిఫ్టి ఏకంగా 0.65 శాతం నష్టంతో ముగిసింది. నిజానికి యూరో మార్కెట్ల పరుగు చూస్తే మన మార్కెట్లు భారీ లాభాలతో ముగుస్తాయని భావించారు. కాని నిఫ్టి బలహీనంగానే ఉంది. యూరో మార్కెట్‌లోని అన్ని ప్రధాన సూచీలు ఒక శాతంపైగా లాభంతో ట్రేడవుతుండగా, యూరో స్టాక్స్‌ సూచీ 1.74 శాతం లాభంతో ట్రేడవుతోంది.