బంపర్ లాభాలతో ముగిసిన నిఫ్టి
యూరప్ మార్కెట్లతో పాటు అమెరికా ఫ్యూచర్స్ భారీ లాభాలతో ఉండటంతో మన మార్కెట్లు కూడా గ్రీన్లో ముగిశాయి.ఆరంభంలోనే 16749 పాయింట్లను తాకిన నిఫ్టి మిడ్ సెషన్లో స్వల్పంగా తగ్గినా… తరవాత కోలుకుంది. దీనికి ప్రధాన కారణం యూరో మార్కెట్ స్వల్ప లాభాల నుంచి ఆకర్షణీయ లాభాల్లోకి రావడం. క్రితం ముగింపుతో పోలిస్త్ నిఫ్టి 142 పాయింట్ల లాభంతో 15699 పాయింట్ల వద్ద ముగిసింది. ఇతర సూచీలన్నీ ఒక శాతం నుంచి ఒకటిన్నర శాతం వరకు పెరిగాయి. ఐటీ షేర్లలో ఒత్తిడి కొనసాగింది. నిఫ్టి టాప్ లూజర్స్ అన్నీ ఐటీ కంపెనీలే. ఆటో రంగానికి చెందిన షేర్లకు గట్టి మద్దతు లభిస్తోంది. బ్యాంకులు.. కొన్ని ఫార్మా కంపెనీలు కూడా. వచ్చే సోమవారం గట్టి పరీక్షను ఎదుర్కోనుంది. 17100 స్థాయిని దాటడం. పైగా అద వారంలో వీక్లీ, నెలవారీ డెరివేటివ్ క్లోజింగ్స్ ఉండటం.