18100పైన ముగిసిన నిఫ్టి
సేమ్ టు సేమ్… నిన్నటి మాదిరే ఇవాళ కూడా నిఫ్టి ఆరంభంలో పతనమై…తరవాత పుంజుకుంది. ఓపెనింగ్‌లో ఆకర్షణీయ లాభాలు ప్రారంభమైన.. కొద్దిసేపటికే 17967ని తాకింది. ఆల్గొ ట్రేడింగ్ ఇవాళ కూడా పనిచేసింది. అనిలిస్టులు ఉదయం చెప్పినట్లే నిఫ్టి దిగువస్థాయిలో మద్దతు అందింది. అక్కడి నుంచి క్రమంగా కోలుకుంటూ వచ్చిన నిఫ్టికి యూరప్ మార్కెట్ల నుంచి ఊతం లభించింది. క్లోజింగ్‌కు ముందు 17149ని తాకిన నిఫ్టి… 18132 వద్ద ముగిసింది. నిఫ్టితో పాటు ఇతర ప్రధాన సూచీలు ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. యూరో మార్కెట్లు ఒక మోస్తరు లాభాలతో ట్రేడ్ కావడంతో పాటు అమెరికా ఫ్యూచర్స్ 0.7 శాతంపైగా లాభంతో ఉండటంతో ఇన్వెస్టర్లు తాజా కొనుగోళ్ళకు మొగ్గు చూపారు. అయితే షేర్లు మాత్రం ఉదయం నుంచి చైనా మార్కెట్‌తో లింక్ ఉన్న షేర్లే లాభపడ్డాయి. ముఖ్యంగా మెటల్ షేర్లు బాగా లాభపడ్డాయి. టాటామోటార్స్ కూడా పుంజుకుంది. నిఫ్టి నెక్ట్స్, మిడ్ క్యాప్ నిఫ్టిలు కూడా ఒక శాతంపైగా లాభంతో క్లోజ్ కావడం విశేషం.