For Money

Business News

17,900పైన ముగిసిన నిఫ్టి

మిడ్‌ సెషన్‌ తరవాత నిఫ్టి చెలరేగిపోయింది. ఉదయం నుంచి తొలి ప్రతిఘటన స్థాయి 17800 ప్రాంతంలో కదలాడిన నిఫ్టి… మిడ్‌సెషన్‌లో యూరో మార్కెట్లు గ్రీన్‌లో ప్రారంభం కావడంతో పాటు ఇవాళ కూడా అమెరికా ఫ్యూచర్స్‌ గ్రీన్‌లో ఉండటంతో నిఫ్టి భారీ లాభాలతో ముగిసింది. దాదాపు అన్ని సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. క్రితం ముగింపుతో పోలిస్తే 258 పాయింట్ల లాభంతో నిఫ్టి 17,929 వద్ద ముగిసింది. ఇక నిఫ్టి మిడ్‌ క్యాప్‌ సూచీ కూడా 1.96 శాతం లాభపడింది. నిఫ్టికి బ్యాంక్‌ నిఫ్టి నుంచి గట్టి మద్దతు లభించింది. ఇక టెలికాం, ఐటీ రంగాల షేర్లకు కూడా మద్దతు లభించింది. గత వారం మొత్తం అమ్మకాలు జరిపిన విదేశీ ఇన్వెస్టర్లు ఇవాళ అమ్మకాల హోరు తగ్గించినట్లు తెలుస్తోంది.