For Money

Business News

17,800పైన ముగిసిన నిఫ్టి

మిడ్‌ సెషన్‌ తరవాత నిఫ్టి అన్ని ప్రతిఘటన స్థాయిలను దాటుకుని 17800పైన ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే 131 పాయింట్ల లాభంతో పెరిగింది. అయితే ఇవాళ్టి కనిష్ఠ స్థాయితో పోలిస్తే నిఫ్టి దాదాపు 200 పాయింట్లు పెరిగింది. ఒకదశలో 17,833 పాయింట్లను తాకింది. అయితే చాలా వరకు క్రూడ్‌ ఆయిల్‌కు ముడిపన కంపెనీల షేర్లు భారీగా పెరిగాయి. ఓఎన్జీసీ, ఐఓసీ, రిలయన్స్‌ ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. మిడ్‌ క్యాప్‌ సూచీ కూడా నిఫ్టి స్థాయిలో పెరిగింది. నిఫ్టి, ఫైనాన్షియల్స్‌లు గ్రీన్‌లో ఉన్నా… లాభాలు ఒక మోస్తరుగా ఉన్నాయి. ప్రపంచ మార్కెట్లకు భిన్నంగా వెళుతున్న మార్కెట్‌కు దేశీయ ఇన్వెస్టర్ల నుంచి గట్టి మద్దతు లభిస్తోంది. ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఆఫర్‌లోగా నిఫ్టి మరింత పెరుగుతుందా లేదా ఈలోగా కరెక్షన్‌ వస్తుందా అనేది చూడాలి. ఓ భారీ ఇష్యూ నేపథ్యంలో అమ్మకాలు రావడం సహజం. అయితే ఎల్‌ఐసీ ఇష్యూను సక్సెస్‌ చేయాలంటే మార్కెట్‌ గ్రీన్‌లో ఉంచాలి కూడా.