చివరిదాకా నిఫ్టి పరుగు
చివరి పది నిమిషాలు మినహా… ఓపెనింగ్ నుంచి నిఫ్టి పరుగులు పెడుతూనే ఉంది. ఉదయం 17,646 పాయింట్లను తాకిన నిఫ్టి… ఒకదశలో 17,843 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే 276 పాయింట్ల లాభంతో 17,822 పాయింట్ల వద్ద ముగిసింది. దాదాపు అన్ని రంగాల షేర్లు పెరగడం కూడా నిఫ్టి చివరిదాకా పెరిగడానికి మరో కారణం. ఉదయం నిఫ్టి ప్రారంభ సమయంలోనే నిఫ్టి పరుగును ఊహించారు. అయితే అసలు టర్న్ ఊహించినట్లు యూరో మార్కెట్ల ప్రారంభం తరవాతే మొదలైంది. రాత్రి అమెరికా, ఉదయం ఆసియా మార్కెట్లు ఒక శాతంపైగా పెరిగాయి. అమెరికా మార్కెట్లు ఇవాళ కూడా పెరుగుతాయన్న సంకేతాలు, యూరో మార్కెట్ల ఉత్సాహంతో నిఫ్టి ఇవాళ భారీ లాభాలు ఆర్జించాయి. ఇన్వెస్టర్లకు ఎక్కడా కొనే ఛాన్స్ ఇవ్వలేదు. నిఫ్టి పడితే కొందామనుకునేవారికి నిరాశ మిగిలింది.
నిఫ్టి టాప్ గెయిన్స్
బజాజ్ ఫిన్‌సర్వ్ 18,430.00 4.63
హిందాల్కో 483.80 4.49
ఎల్ అండ్ టీ 1,774.55 3.72
టాటా మోటార్స్ 321.00 3.51
కోల్ ఇండియా 167.50 3.33
నిఫ్టి టాప్ లూజర్స్
హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ 725.15 -1.08
డాక్టర్ రెడ్డీస్ 4,799.95 -0.96
జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 674.30 -0.63
టాటా కన్జూమర్స్ 850.00 -0.49
ఐటీసీ 242.35 -0.47