17600పైన ముగిసిన నిఫ్టి
అంతర్జాతీయ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నా…మన మార్కెట్లు గ్రీన్లో ముగిశాయి. ఉదయం నష్టాల్లోకి జారుకున్నా… వెంటనే కోలుకున్న మార్కెట్లు రోజంతా లాభాల్లోనే కొనసాగాయి. ఒకదశలో 17667 గరిష్ఠ స్థాయిని తాకిన నిఫ్టి… క్లోజింగ్లో 17624 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే 93 పాయింట్ల లాభంతో క్లోజైంది. నిఫ్టి మిడ్ క్యాప్ మినహా… మిగిలిన ప్రధాన సూచీలు గ్రీన్లో ముగిశాయి. ఇవాళ నిఫ్టికి బ్యాంకులు, ఫైనాన్షియల్స్ నుంచి గట్టి మద్దతు లభించింది. ముఖ్యంగా ఫైనాన్షియల్స్లో బజాజ్ ట్వీన్స్ ఆకర్షణీయ లాభాల్లో ముగిశాయి. నిఫ్టిలో 29 షేర్లు లాభాల్లో క్లోజ్ అయ్యాయి. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, ఎస్బీఐ లైఫ్, హెచ్డీఎఫ్సీ షేర్లు ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. మరోవైపు మిడ్ సెషన్ సమయంలో ప్రారంభమైన యూరో మార్కెట్లు 1.5 శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. అలాగే అమెరికా ఫ్యూచర్స్ కూడా దాదాపు ఒక శాతం నష్టంతో ఉన్నాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ మన మార్కెట్లు గ్రీన్లో క్లోజ్ కావడం విశేషం. ఎల్లుండి రాత్రికి అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచనుంది.