For Money

Business News

17150పైన ముగిసిన నిఫ్టి

దాదాపు 330 పాయింట్లకు పైగా పెరిగిన నిఫ్టి 17,250 ప్రాంతంలో ప్రతిఘటన ఎదుర్కొంది. ముఖ్యంగా ట్రేడింగ్‌ చివరి అరగంటలో ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించడంతో 266 పాయింట్ల లాభంతో నిఫ్టి ముగిసింది. ఇవాళ ఉదయం 16,987 స్థాయిని తాకిన నిఫ్టి తరవాత కోలుకుంది. క్రమంగా పెరుగుతూ వచ్చింది. మిడ్‌ సెషన్‌ తరవాత మరింత బలపడి 17,251 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. నిఫ్టికి మెటల్స్‌, బ్యాంక్స్‌ గట్టి మద్దతు ఇచ్చాయి. అలాగే ఇతర షేర్లు కూడా ఎంతో కొంత తోడుగా ఉన్నాయి. మొత్తం 50 నిఫ్టి షేర్లలో 45 షేర్లు లాభాల్లో ముగిశాయి. రేపు ఆర్బీఐ పరపతి విధానం నేపథ్యంలో బ్యాంక్‌ నిఫ్టి 2.5 శాతం పెరగడం విశేషం. మిడ్ క్యాప్‌ నిఫ్టి, నిఫ్టి నెక్స్ట్‌లు ఒకటిన్నర శాతం లాభపడ్డాయి.