For Money

Business News

16,900 పైన ముగిసిన నిఫ్టి

చివరి నిమిషంలో కొన్ని షేర్లలో స్వల్ప స్థాయిలో లాభాల స్వీకరణ జరిగినా… నిఫ్టిలో చాలా షేర్లు గరిష్ఠ స్థాయి వద్ద ముగిసింది. నిఫ్టి క్రితం ముగింపుతో పోలిస్తే 288 పాయింట్ల లాభంతో 16929 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 1041 పాయింట్ల లాభంతో ముగిసింది. ఇవాళ నిఫ్టిని బాగా ప్రభావితం చేసిన షేర్లు బజాజ్‌ ట్విన్స్‌. బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ ఇవాళ 10 శాతంపైగా లాభంతో క్లోజ్‌ కావడంతో నిఫ్టి ఫైనాన్షియల్స్‌ సూచీ రెండు శాతంపైగా పెరిగింది. దీంతో నిఫ్టి కూడా 1.71 శాతం లాభపడింది. నిఫ్టి బ్యాంక్‌ 1.62 శాతం లాభపడగా… నిఫ్టి మిడ్‌ క్యాప్‌లో ఆ ఉత్సాహం కన్పించలేదు. కాని నిఫ్టి నెక్ట్స్‌ మాత్రం ఒక శాతంపైగా లాభపడింది. టాటా స్టీల్‌, కొటక్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ లైఫ్ షేర్లు కూడా నాలుగు శాతం దాకా లాభపడ్డాయి. ఫలితాలు నిరుత్సాహకరంగా ఉండటంతో శ్రీసిమెంట్‌ షేర్లు బాగా నష్టపోయాయి. ఇక ఐటీ షేర్లు ఇవాళ వెలుగులో ఉన్నాయి. అలాగే కొన్ని ఫార్మా షేర్లు కూడా. లారస్‌ ల్యాబ్‌ ఆరంభంలో కాస్త తడబడినా… చివరికి స్వల్ప లాభాలతో ముగిసింది. ఫలితాలు అంతంత మాత్రమే ఉండటంతో డిక్సన్‌ టెక్నాలజీస్‌ మూడున్నర శాతం నష్టపోయింది. ప్రధాన యూరో మార్కెట్లు నష్టాల్లో ఉన్నా.. మన మార్కెట్లు గ్రీన్‌లో ముగియడం విశేషం.