నిఫ్టికి అమెరికా ఫ్యూచర్స్ అండ
తీవ్ర ఒడుదుడుకుల మధ్య నిఫ్టి ఇవాళ ముగిసింది. ఉదయం దాదాపు వంద పాయింట్ల నష్టంతో 16187 వద్ద ప్రారంభమైన నిఫ్టి అక్కడి నుంచి మిడ్ సెషన్‌కల్లా లాభాల్లోకి వచ్చింది. యూరో మార్కెట్లు నిరుత్సాహంగా ఉండటంతో మన మార్కెట్ మళ్ళీ నష్టాల్లోకి జారుకుంది. కాని క్లోజింగ్‌కు ముందు అమెరికా ఫ్యూచర్స్ కారణంగా స్వల్ప షార్ట్ కవరింగ్ వచ్చింది. యూరో కూడా స్థిరంగా ఉండటంతో నిఫ్టి 16340 పాయింట్ల వద్ద ముగిసింది. అంతకుముందు నిఫ్టి 16359ని కూడా తాకింది. కనిష్ఠ స్థాయి నుంచి నిఫ్టికి దాదాపు 170 పాయింట్ల లాభం రావడం విశేషం. దిగువ స్థాయిలో కొన్నవారికి మంచి లాభాలు దక్కాయి. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 62 పాయింట్లు లాభపడింది. అన్ని సూచీలు లాభాల్లో ముగిశాయి. అయితే నిఫ్టి బ్యాంక్ ఒక శాతంపైగా లాభపడటం విశేషం. రెండు శాతంపైగా లాభంతో యాక్సిస్ బ్యాంక్ నిఫ్టి టాప్ గెయినర్‌గా నిలిచింది. మూడు శాతం నష్టంతో ఓఎన్‌జీసీ టాప్ లూజర్‌గా నిలిచింది. నిఫ్టి నెక్ట్స్‌లో బ్యాంక్ ఆఫ్ బరోడా, నిఫ్టి మిడ్‌క్యాప్‌లో పర్సిస్టెన్ట్స్ టాప్ గెయినర్‌గా నిలిచింది.