For Money

Business News

చివర్లో మద్దతు అందినా.. నష్టాలే

నిఫ్టి ఇవాళ ఆరంభంలో కొద్దిసేపు మాత్రమే గ్రీన్‌లో ఉంది. తరవాత రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. ఒకదశలో 18,048 పాయింట్లకు పడిన నిఫ్టి వీక్లీ డెరివేటివ్స్‌ కారణంగా షార్ట్‌ కవరింగ్‌తో 88 పాయింట్ల నష్టంతో 18,178 పాయింట్ల వద్ద ముగిసింది. మెటల్స్‌, ఐటీతో పాటు రిలయన్స్‌ షేర్లలో ఒత్తిడి వచ్చింది. చివర్లో బ్యాంకు షేర్లలో వచ్చిన ర్యాలీ కారణంగా భారీ నష్టాలు తప్పాయి. బ్యాంక్‌ నిఫ్టి 1.3 శాతం పెరిగి మళ్ళీ 40,000 స్థాయిని దాటింది. ఇతర షేర్లు చాలా డల్‌గా ఉండటానికి కారణం ప్రధాన కారణంగా కంపెనీ కార్పొరేట్‌ ఫలితాలు మార్కెట్‌ అంచనాలకు అనుగుణంగా లేకపోవడమే. నిఫ్టి కన్నా మిడ్‌ క్యాప్‌ షేర్లలో గట్టి రివకరీ వచ్చింది. నిఫ్టి నెక్స్ట్‌ 0.7 శాతం నష్టంతో ముగిసింది. రేపు వెల్లడి అయ్యే రిలయన్స్‌ ఫలితాల కోసం మార్కెట్‌ ఎదురు చూస్తోంది.