నిఫ్టి: నిన్నటి లాభాలు నేడు ఉఫ్…
నిన్న వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ కారణంగా నిఫ్టిని పెంచారు. ఇవాళ అదే నిఫ్టిని ఇవాళ మరింత పెంచి… అమ్మారు. విదేశీ ఇన్వెస్టర్ల ఆప్షన్ ట్రేడింగ్ ముందు నిఫ్టి నిలబడలేకపోయింది. విదేశీ ఇన్వెస్టర్లకు దీటుగా దేశీయ ఆర్థిక సంస్థలు పెట్టుబడులు పెట్టకపోవడం, ఆప్షన్స్‌లో చురుగ్గా లేకపోవడం వల్ల నిఫ్టిని కాపాడటం కష్టపోయింది. మిడ్ సెషన్ తరవాత ప్రారంభమైన యూరో మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నా… నిఫ్టిలో మాత్రం అమ్మకాలు కొనసాగాయి. ఉదయం 17,489 పాయింట్ల గరిష్ఠ స్థాయికి చేరిన నిఫ్టి క్లోజింగ్ సమయానికి 17,180కి పడిపోయింది. అంటే పతనం 300 పాయింట్లపైనే. క్రితం ముగింపుతో పోలిస్తే 205 పాయింట్ల నష్టంతో 17,196 పాయింట్ల వద్ద నిఫ్టి ముగిసింది. బ్యాంక్ నిఫ్టి, ఫైనాన్షియల్ షేర్లు భారీ నష్టాలతో ముగిశాయి. నిఫ్టి మిడ్ క్యాప్ సూచీ మాత్రం సరిగ్గా నిన్నటి ముగింపు వద్దే ముగిసింది.