For Money

Business News

17,400లకు చేరువలో నిఫ్టి

సింగపూర్‌ నిఫ్టికి భిన్నంగా నిఫ్టి ఇవాళ భారీ లాభాలతో ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 17,383 పాయింట్లను తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 206 పాయింట్ల లాభంతో 17382 వద్ద ట్రేడవుతోంది. విచిత్రంగా ఇతర సూచీలకంటే అధికంగా నిఫ్టి పెరగడం విశేషం. మిడ్‌ క్యాప్‌ కూడా 1.06 శాతం లాభపడగా, నిఫ్టి 1.2 శాతం లాభంతో ఉంది. నిఫ్టి నెక్ట్స్‌ లాభాలు ఒక శాతం కన్నా తక్కువగా ఉన్నాయి. 1700 దిగువన పుట్‌ రైటింగ్‌ చేసిన విదేశీ ఇన్వెస్టర్లు 17400 వద్ద కవర్‌ చేసుకుంటున్నారు. నిఫ్టి లో 49 షేర్లు లాభాల్లో ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ షేర్‌ ఒక్కటే నష్టాల్లో ఉంది. క్వాలిఫైడ్‌ ఇన్వెస్టర్లు ఇవాళ్టి నుంచి నైకాలో తమ షేర్లను అమ్ముకునే అవకాశం ఉంది. దీంతో ఇవాళ నైకా షేర్‌ 5 శాతం క్షీణించింది. ఆల్‌ టైమ్‌ గరిష్ఠ స్థాయి నుంచి నైకా 20 శాతం దాకా క్షీణించింది.