16700 చేరువలో నిఫ్టి
సింగపూర్ నిఫ్టితో పోలిస్తే ఆకర్షణీయ లాభాలతో నిఫ్టి ప్రారంభమైంది. ఆరంభంలోనే నిఫ్టి 16693ని తాకింది. ఇపుడు 16,668 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 63 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. బ్యాంక్ నిఫ్టి, నిఫ్టి మిడ్ క్యాప్ సూచీలు అరశాతంపైగా లాభంతో ట్రేడువుతోంది. నిఫ్టిలో 45 షేర్లు లాభాల్లో ఉన్నాయి. ట్రేడింగ్ చాలా వరకు ఎంపిక చేసిన షేర్లకే పరిమితమైంది. నిఫ్టి టాప్ గెయినర్స్‌లో యూపీఎల్ టాప్‌లో ఉంది. నిన్న ఇండస్ ఇండ్ బ్యాంక్ పెరగ్గా, ఇవాళ కొటక్ బ్యాంక్ షేర్ వెలుగులో ఉంది. ఇక నిఫ్టిలో ఇన్ఫోసిస్ టాప్ లూజర్‌గా ఉంది. కెన్‌ఫిన్ బ్యాంక్ షేర్ 9 శాతం దాకా లాభపడింది. చూస్తుంటే సీలింగ్‌ను తాకే అవకాశముంది. ఫలితాలకు ఎస్ఆర్ఎఫ్ కూడా స్పందిస్తోంది. ఈ షేర్ 1.5 వాతం లాభంతో ఉంది. ఆసియా మార్కెట్లన్నీ గ్రీన్‌లో ఉన్నాయి. అయితే అమెరికా ఫ్యూచర్స్ స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. కాబట్టి మిడ్ సెషన్లో మార్కెట్ కీలక టర్న్ తీసుకోవచ్చు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫలితాలు ఇవాళ మార్కెట్ తరవాత విడుదల అవుతాయి.