For Money

Business News

భారీ లాభాలతో ప్రారంభం కానున్న నిఫ్టి

ఆసియా మార్కెట్లు మళ్ళీ గ్రీన్‌లోకి వచ్చాయి. ఒమైక్రాన్‌ దెబ్బకు రాత్రి రెండున్నర శాతం నష్టపోయిన వాల్‌స్ట్రీట్‌ క్లోజింగ్‌లో కోలుకుని ఒక శాతం నష్టంతో ముగిసింది. ఇపుడు అమెరికా ఫ్యూచర్స్‌ అర శాతం గ్రీన్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆసియా మార్కెట్లు గ్రీన్‌లో ట్రేడవుతున్నాయి. జపాన్‌ ఏకంగా రెండు శాతం లాభంతో ట్రేడవుతోంది. కాని మిగిలిన స్టాక్‌ మార్కెట్లన్నీ అర శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. చైనా మార్కెట్లు పెద్దగా క్షీణించిందీ లేదు, ఇపుడు పెరిగిందీ లేదు. నిలకడగా ఉన్నాయి. హాంగ్‌సెంగ్‌ 0.4 శాతం లాభంతో ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో సింగపూర్‌ నిఫ్టి దాదాపు 165 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. అంటే ఒక శాతం లాభమన్నమాట. నిఫ్టి ఇదే స్థాయి లాభాలతో ప్రారంభంకాకున్నా… ఒక మోస్తరు లాభాలతో ప్రారంభం కావొచ్చు.