For Money

Business News

NIFTY TODAY: 16,790 లక్ష్మణ రేఖ

భారీ నష్టాల తరవాత మార్కెట్లు చల్లబడుతున్నాయి. ఆసియా మార్కెట్లు అర శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. సింగపూర్‌ నిఫ్టి మాత్రం ఒక శాతం లాభం చూపుతోంది. నిఫ్టి క్రితం ముగింపు 16,614. సింగపూర్‌ నిఫ్టి స్థాయిలో మన నిఫ్టి ప్రారంభమౌతుందా అన్న అనుమానాలు ఉన్నాయి. నిఫ్టి గనుక16,740 దాటితే 16770వరకు వెళ్ళే అవకాశముంది. ఒకవేళ నిఫ్టి గనుక ఈ స్థాయికి చేరినా దాటినా 16790 స్టాప్‌లాస్‌తో అమ్మొచ్చు. నిఫ్టి16,740 వద్ద కొనసాగే అవకాశాలు ఉన్నాయి. 16,670 దిగువకు రానంత వరకు నిఫ్టి బలంగా ఉన్నట్లే. నిఫ్టిని అధిక స్థాయిలో అమ్మేవారు నిఫ్టి 16740 దిగువకు వస్తుందా అన్నది గమనించండి. ఎందుకంటే నిఫ్టి క్లోజింగ్‌ ఇదే స్థాయిలో ఉంటుందని టెక్నికల్‌ అనలిస్టులు అంటున్నారు. అయితే ప్రస్తుత స్థాయిలో మాత్రం కొనుగోలు చేయొద్దని సలహా ఇస్తున్నారు. నిన్న కొనుగోలు చేసినవారు ఇవాళ పాక్షిక లాభాలు స్వీకరించవచ్చు. నిఫ్టికి 16,440 వరకు మద్దతు లేదు. నిఫ్టి కొనాలనుకునేవారు…ఈ స్థాయి వరకు వెయిట్‌ చేయాల్సిందే. చిన్న ఇన్వస్టర్లు నిఫ్టి ట్రేడింగ్‌కు దూరంగా ఉండటం మంచిది. నిఫ్టి నిలదొక్కుకునేంత వరకు ఆగండి.