For Money

Business News

సూచీలు పైకి… షేర్లు దిగువకు

భారత దేశ మార్కెట్లలో చిత్రమైన పరిస్థితి నెలకొంది. సూచీలు రోజూ ఆల్‌ టైమ్‌ గరిష్ఠ స్థాయిలు నెలకొల్పతుండగా… అనేక షేర్లు నష్టాలతో ముగుస్తున్నాయి. పలు ప్రధాన కంపెనీల షేర్లు 52 వారాల గరిష్ఠ స్థాయిలను కూడా తాకున్నాయి. కేవలం బ్యాంక్‌ షేర్లు మార్కెట్‌ను నిలబడుతున్నాయి. అలాగే సూచీల్లో అధిక వెయిటేజీ ఉన్న షేర్లలో వస్తున్న ర్యాలీ కారణంగా నిఫ్టి భారీ లాభాల్లో ముగిసింది. గ్రాసిం, ఐటీసీ, బీపీసీఎల్‌ వంటి షేర్లు ఇవాళ భారీగా లబ్ది పొందాయి. ఇప్పట్లో పెట్రోల్‌, డీజిల్‌ రేట్లను తగ్గించరనే వార్తలతో ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల షేర్లు భారీగా లాభపడ్డాయి. నిఫ్టి ఇవాళ 133 పాయింట్ల లాభంతో 19322 పాయింట్ల వద్ద ముగిసింది. బ్యాంక్‌ నిఫ్టి 0.92 శాతం లాభపడగా, నిఫ్టి నెక్ట్స్‌ 0.4 శాతం లాభంతో ముగిశాయి. మిడ్‌ క్యాప్‌ నిఫ్టి మాత్రం క్రితం ముగింపు వద్దే ముగిసింది.