For Money

Business News

కొత్త ఐఫోన్లలో శాటిలైట్‌ మోడమ్‌

అత్యవసర సమయంలో వైఫై లేకుంటే… సెల్‌ డేటా లేకున్నా సమాచారం అందించేందుకు వీలుగా తన కొత్త ఫోన్‌లో ప్రత్యేక మోడమ్‌ను యాపిల్ కంపెనీ ఏర్పాటు చేసింది. ఐఫోన్‌ 14 సిరీస్‌లో క్వాల్కమ్‌ కంపెనీకి చెందిన చిప్‌ను యాపిల్‌ను అమర్చినట్లు ఐఫిక్సిట్‌ కంపెనీ పేర్కొంది. మార్కెట్‌లో వచ్చిన కొత్త ఫోన్లను విడగొట్టి.. అందులో ఉన్న హార్డ్‌వేర్‌ను పరిశీలించడం ఈ కంపెనీ ప్రధాన పని. అలాగే ఐఫోన్‌ 14 సిరీస్‌ ఫోన్‌ను పరీక్షించిన ఈ కంపెనీ .. సదరు ఫోన్‌లో క్వాల్కమ్‌ X65 మోడమ్‌ చిప్‌ ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే నవంబర్‌ నెలలో ఈ చిప్‌ పనిచేసేలా యాపిల్‌ చర్యలు తీసుకోనుంది. గ్లోబల్‌ స్టార్‌కు చెందిన శాటిలైట్స్‌ను దీని కోసం యాపిల్‌ ఉపయోగించనుంది. n53 ఫ్రీక్వెన్సీ బాండ్‌ను గ్లోబల్‌స్టార్‌ వాడుతోంది. కొత్త మెసేజింగ్‌ ఫీచర్‌ కోసం కొత్త హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌ను ఐఫోన్‌ 14 సిరీస్‌లో ఉపయోగించిన వాట నిజమేనని యాపిల్‌ ప్రకటించింది. సో… యాపిల్‌ 14 సిరీస్‌ ఫోన్‌ వాడేవారు.. వైఫై సర్వీస్‌ లేకున్నా.. సెల్‌ డేటా లేకున్నా… అత్యవసర సమయాల్లో మెసేజ్‌లు పంపే అవకాశం ఉంటుందన్నమాట.