యాక్సిస్ బ్యాంక్ -శాంసంగ్ క్రెడిట్ కార్డ్..
శాంసంగ్ కంపెనీ, యాక్సిస్ బ్యాంక్ సంయుక్తంగా వీసా క్రెడిట్ కార్డును విడుదల చేశాయి. ఈ కార్డు ద్వారా శాంసంగ్ ఉత్పత్తుల కొంటే… 10 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ సౌకర్యం ఏడాది పొడువునా ఉంటుంది. అలాగే ఈఎంఐ, నాన్-ఈఎంఐ లావాదేవీలకూ ఈ క్యాష్‌బ్యాక్ వర్తిస్తుందని యాక్సిస్ బ్యాంక్, శాంసంగ్ తెలిపాయి. స్మార్ట్‌ఫోన్స్, ట్యాబ్లెట్స్, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్మెషిన్లను శాంసంగ్ విక్రయిస్తోంది. వీటి కొనుగోలుకు వినియోగదారులకు భిన్నమైన ఫైనాన్స్ ఆప్షన్ ఇవ్వడం కోసం యాక్సిస్ బ్యాంక్‌తో జతకట్టింది. దీని ద్వారా తన ఉత్పత్తుల విక్రయాలు పెంచుకోవాలని శాంసంగ్ భావిస్తోంది.