For Money

Business News

కొత్తగా ఏపీలో 22 ఎఫ్‌ఎం స్టేషన్లు

దేశ వ్యాప్తంగా కొత్తగా 730 ఎఫ్‌ఎం స్టేషన్లను ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటి వరకు ఈ సర్వీసులు లేని పట్టణాల్లో వీటిని ప్రారంభిస్తారు. దీనికి సంబంధించిన వేలం ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది. ప్రధాని మోడీ నేతృత్వంలో జరిగిన ఇవాళ్టి కేబినెట్‌ సమావేశంలో కొత్త ఎఫ్‌ఎంలపై నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 243 కొత్త పట్టణాల్లో 730 కొత్త ఎఫ్‌ఎం స్టేషన్లను ప్రారంభిస్తారు. వీటి కోసం అయ్యే ఖర్చు రూ. 784 కోట్లుగా కేంద్రం అంచనా వేస్తోంది.ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 22, తెలంగాణలో 10 పట్టణాల్లో కొత్త ఎఫ్‌ఎం స్టేషన్లు రానున్నాయి. అత్యధికంగా32 కొత్త స్టేషన్లు యూపీలో రానున్నాయి.