తక్కువ ధర… అయినా ఇచ్చేస్తున్నారు
ఇవాళ ఎన్డీటీవీ షేర్ 5 శాతం లాభంతో రూ. 406.10 వద్ద ముగిసింది. ఎన్డీటీవీ ఓపెన్ ఆఫర్ కింద అదానీ గ్రూప్ చెల్లిస్తున్న ధర రూ. 294. ఓపెన్ ఆఫర్ కింద ఇవ్వడం కన్నా… ఓపెన్ మార్కెట్లో అమ్మితే 38 శాతం అధిక ధర లభిస్తుంది. అయినా … ఓపెన్ ఆఫర్కే షేర్ల అమ్ముతున్న కొందరు ఇన్వెస్టర్లు. ముఖ్యంగా కంపెనీలు. రియల్ బిల్డ్, ఆదేశ్ బ్రోకింగ్ హౌసింగ్, గ్రిడ్ సెక్యూరిటీస్, డ్రోలియా ఏజెన్సీ వంటి కంపెనీలు తమ వద్ద ఉన్న షేర్లను 38 శాతం లాభంతో రూ. 406కు కాకండా రూ. 294లకే అదానీలకు అమ్మేశాయి. ఓపెన్ ఆఫర్లో 31 శాతంపైగా షేర్లు వచ్చేశాయి. కంపెనీలు 39.35 లక్షల షేర్లు అమ్మగా, రీటైల్ ఇన్వెస్టర్లు 7.07 శాతం షేర్లను అమ్మడం విశేషం. ఓపెన్ మార్కెట్లో వీటి చేత ఇన్నాళ్ళు కొనిపించి… ఇపుడు ఓపెన్ ఆఫర్ ద్వారా అదానీనే తీసుకుంటున్నారా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఓపెన్ ఆఫర్ పూర్తి కావాలంటే ఇంకా 69 శాతం షేర్లు రావాల్సి ఉంది. అయితే ఓపెన్ ఆఫర్ డిసెంబర్ 5గా ఓపెన్ అయి ఉంటుంది.