For Money

Business News

దక్కన్‌ క్రానికల్‌ అమ్మకానికి బ్రేక్‌

దక్కన్‌ క్రానికల్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ (డీసీహెచ్‌ఎల్‌) అమ్మకం ప్రక్రియ మళ్ళీ మొదటికి వచ్చింది. విజన్‌ ఇండియా ఫండ్‌-శ్రేయీ మల్టిపుల్‌ అసెట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ సమర్పించిన పరిష్కార ప్రణాళికకు హైదరాబాద్‌ ఎన్‌సీఎల్‌టీ (NCLT) గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వగా ఢిల్లీలోని అప్పిలేట్‌ ట్యైబ్యూనల్‌ -ఎన్‌సీఎల్‌ఏటీ (NCLAT) కొట్టివేసింది. దీంతో ఈ వ్యవహారం మొదటికి వచ్చింది. నిధుల కేటాయింపులో క్రెడిటార్ల మధ్య ‘‘వివక్ష’’ కనిపిస్తున్నందు వల్ల దీన్ని ఆమోదించడం సాధ్యం కాదని NCLAT ప్రకటించింది. హైదరాబాద్‌ ఎన్‌సీఎల్‌టీ ఇచ్చిన ఆదేశాలను ఐడీబీఐ బ్యాంక్‌ అప్పిలేట్‌ ట్రైబ్యూనల్‌లో సవాలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారించిన అనంతరం ఎన్‌సీఎల్‌ఏటీ ఈ తీర్పు ప్రకటించింది. ఆ పరిష్కార ప్రణాళిక ప్రకారం ఫైనాన్షియల్‌ క్రెడిటార్లందరికీ రూ.350 కోట్లు నగదుగా చెల్లిస్తారు. అయితే మొత్తం 37 మంది ఫైనాన్షియల్‌ క్రెడిటార్లు చేసిన క్లెయిమ్‌ల మొత్తం రూ.8,180 కోట్లు. కెనరా బ్యాంక్‌ అభ్యర్థన మేరకు దక్కన్‌ క్రానికల్‌ హోల్డింగ్స్‌పై ఇన్‌సాల్వెన్సీ ప్రక్రియ ప్రారంభమైంది. 2018 జూన్‌ 14వ తేదీన 12వ సీఓసీ సమావేశంలో శ్రేయీ మల్టిపుల్‌ అసెట్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ట్రస్ట్‌ను గరిష్ఠ బిడ్డర్‌గా ప్రకటించారు. అయితే సెటిల్మెంట్‌లో భాగంగా తమకు ఇవ్వజూపిన మొత్తం ఆమోదనీయం కాదని ఐడీబీఐ బ్యాంక్‌ ఆ బిడ్‌ను వ్యతిరేకించి ఢిల్లీలో సవాలు చేసింది.