NCC, GMR షేర్లపై నజర్
NCC కంపెనీ షేర్లు ఇవాళ వెలుగులో ఉన్నాయి. ఈ కంపెనీకి భారీ ఆర్డర్ రావడమే దీనికి కారణం. గౌహతిలో మెడికల్ కాలేజీ, హాస్పిటల్‌లను కంపెనీ నిర్మించనుంది. రూ. 2,063 కోట్ల ఆర్డర్ విలువైన ఈ ఆర్డర్ తమకు వచ్చినట్లు కంపెనీ పేర్కొంది. అలాగే జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ షేర్ కూడా ఇవాళ వెలుగులో ఉండనుంది. రూ. 100పైన ఈ షేర్ టెక్నికల్‌గా గట్టిగా నిలబడింది. ఇవాళ కంపెనీకి చెందిన ఎస్‌ఈజడ్‌లో ఫ్రాన్స్‌కు చెందిన శాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్‌తో కలిసి జీఎంఆర్ గ్రూప్ ఎంఆర్‌ఓ కేంద్రాన్ని నెలకొల్పింది. ఈ కేంద్రాన్ని నేడు ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. జీఎంఆర్ ఎస్‌ఈజడ్‌లో రూ. 1300 కోట్లతో ఎంఆర్‌ఓను నిర్మించారు.
