నాన్ స్టాప్ నాస్‌డాక్
నాలుగు వారాలుగా లాభాల్లో ఉన్న నాస్‌డాక్… ఈ వారం రెండో రోజు కూడా లాభాల్లో పయనిస్తోంది. ఎస్ అండ్ పీ 500 సూచీ కూడా నాస్‌డాక్ బాటలోనే పయనిస్తోంది. ఇక డౌజోన్స్ స్వల్ప నష్టాల్లో ఉన్నా.. ఏ క్షణమైనా గ్రీన్‌లోకి వచ్చే అవకాశముంది. కార్పొరేట్ దిగ్గజాల ఫలితాల కోసం మార్కెట్ ఎదురు చూస్తోంది. యూరో మార్కెట్లన్నీ ఒక శాతం దాకా నష్టపోయినా.. వాల్‌స్ట్రీట్ గ్రీన్‌లో కొనసాగుతోంది. డాలర్ ఇండెక్స్ ఇవాళ కూడా 104 ప్రాంతంలో స్థిరంగా ఉంది. మరోవైపు క్రూడ్ ధరలు మరింత తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ 70 డాలర్లను తాకింది. బులియన్ మార్కెట్‌లో పసిడి, బంగారం మళ్ళీ పెరిగాయి. ఔన్స్ బంగారం ధర 2775 డాలర్ల ప్రాంతంలో ఉంది.