For Money

Business News

భారీ లాభాల్లో వాల్‌స్ట్రీట్‌

మరికొన్ని గంటల్లో అమెరికా ఫెడరల్‌ బ్యాంక్‌ రెండు రోజుల భేటీ తరవాత ప్రకటన వెలువడనుంది. ఇప్పటి వరకు ఫెడ్‌ వడ్డీ రేట్లను పెంచుతుందని భారీగా క్షీణించిన వాల్‌స్ట్రీట్‌ ఇపుడు ఆ షాక్‌ నుంచి తేరుకుంది. మార్కెట్‌ ఇప్పటికే వడ్డీ పెంపును డిస్కౌంట్‌ చేసినట్లు కన్పిస్తోంది. లేదా మార్కెట్‌ తరవాత స్పందిస్తుందేమో చూడాలి. ప్రస్తుతానికి వాల్‌స్ట్రీట్‌ భారీ లాభాలతో దూసుకుపోతోంది. మైక్రోసాఫ్ట్‌ గైడెన్స్‌ అద్భుతంగా ఉండటంతో నాస్‌డాక్‌ రెండు శాతంపైగా లాభపడింది. అలాగే ఎస్‌ అండ్ పీ 500 సూచీ కూడా 1.5 శాతం లాభపడింది. డౌజోన్స్‌ ఒక శాతం లాభంతో ట్రేడవుతోంది. ఇక ఉక్రెయిన్‌ యుద్ధ భయాలు కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు ఇవాళ కూడా రష్యాను హెచ్చరించారు. ఈ నేపథ్యంలో డాలర్‌, ముడి చమురు పెరగడం విశేషం. ముడి చమురు రికార్డు స్థాయిలో 89 డాలర్లను దాటింది. ఉక్రెయిన్‌ దాడులు మొదలైతే మాత్రం క్రూడ్‌ మరింత దూసుకు పోయే అవకాశముంది.