For Money

Business News

దూసుకుపోతున్న మార్కెట్లు

జులై నెలలో అమెరికా ద్రవ్యోల్బణం ఊహించినదాని కన్నా తక్కువ రావడంతో.. ఈక్విటీ మార్కట్లు దూసుకుపోతున్నాయి. జులైలో నెలలో వార్షిక ద్రవ్యోల్బణం 8.7 శాతం, నెలవారి ద్రవ్యోల్బణం 0.2 శాతం పెరుగుతుందని మార్కెట్‌ భావించారు. అయితే వార్షిక ద్రవ్యోల్బణం 8.5 శాతం రాగా.. నెలవారి ద్రవ్యోల్బణంలో ఎలాంటి మార్పు లేదు. అంటే జూన్‌లో ఉన్న స్థాయిలోనే ఉంది. దీంతో భారీగా వడ్డీ రేట్లు పెంచే అవకాశాలు తగ్గాయి. దీంతో డాలర్‌ కుప్పకూలింది. డాలర్‌ 1.63 శాతం తగ్గింది. దీంతో డాలర్‌ ఇండెక్స్‌ 104.51కు చేరింది. ఈ దెబ్బకు ఈక్విటీ మార్కెట్లలో భారీ కొనుగోళ్ళ ఆసక్తి వచ్చింది. నాస్‌డాక్‌ 2.59 శాతం పెరగ్గా, ఎస్‌ అండ్ పీ 500 సూచీ 2.06 శాతం పెరిగింది. గ్రోత్‌ స్టాక్స్‌ కూడా రాణించడంతో డౌజోన్స్‌ 1.79 శాతం పెరిగింది. ఇక ద్రవ్యోల్బణం తగ్గడంతో పాటు అమెరికా చమురు నిల్వలు భారీగా పెరగడంతో క్రూడ్‌ ధరలు మరింత క్షీణించాయి.