అదరగొట్టిన టెక్ షేర్లు
ఫెడ్ వడ్డీ రేట్ల పెంపును మార్కెట్ ఎపుడో డిస్కౌంట్ చేసినందున… రాత్రి అమెరికా మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ముఖ్యంగా టెక్ షేర్లలో భారీ ర్యాలీ వచ్చింది. నాస్డాక్ 3.8 శాతం పెరిగింది. ఫేస్బుక్ ఆరుశాతంపైగా లాభపడగా… అమెజాన్, యాపిల్, ఆల్ఫాబెట్ షేర్లు రెండు శాతం కన్నా అధికంగా పెరిగాయి. ఐటీ, టెక్ షేర్ల ర్యాలీతో ఎస్ అండ్ పీ 500 సూచీ కూడా 2.2 శాతం పెరిగింది. వడ్డీ రేట్లు పెరగడమంటే… బాండ్ ఈల్డ్స్ పెరగడమే. అంటే బ్యాంకులకు మరిన్ని లాభాలు. దీంతో అనేక బ్యాంకులు రాత్రి ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. డౌజోన్స్ 1.6 శాతం లాభపడింది. ఈ ఏడాది మొత్తం ఏడుసార్లు వడ్డీ రేట్లు పెంచేందుకు ఫెడరల్ రిజర్వ్ నిర్ణయించడంతో మున్ముందు మార్కెట్ ఎలా ఉంటుందో చూడాలి. పైగా ఉద్దీపన పథకాల్లో వేటికి గుడ్ బై చెబుతారో కూడా చూడాలి.