For Money

Business News

వడ్డీ రేట్లను పెంచిన అమెరికా

దాదాపు మూడు సంవత్సరాల తరవాత అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను పెంచింది. రెండు రోజుల భేటీ తరవాత వడ్డీ రేట్లను 0.25 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. 1970ల తరవాత అమెరికాలో ఎన్నడూ లేని స్థాయికి ద్రవ్యోల్బణం పెరిగిన విషయం తెలిసిందే. తాజా పెంపుతో అమెరికాలో వడ్డీ రేట్లు 0.25 శాతం నుంచి 0.50 శాతం మధ్య ఉంటాయి. మున్ముందు ఆర్థిక పరిస్థితిపై ఫెడరల్‌ రిజర్వ్‌ వ్యాఖ్యానం చేస్తూ ద్రవ్యోల్బణం అధికంగా ఉండబోతోందని పేర్కొంది. ఏడాది చివరి నాటికి 4.3 శాతం ఉండొచ్చని తెలిపింది. వాస్తవానికి అమెరికాలో ద్రవ్యోల్బణం 2 శాతం ఉంచాలనేది వార్షిక టార్గెట్‌ కోవిడ్‌ వల్ల అనేక ఉద్దీపన చర్యలను తీసుకున్నామని, వాటిని తొలగించనున్నట్లు పేర్కొంది. దీంతో ఈ ఏడాది ఆర్థికవృద్ధి రేటు 2.8 శాతానికి పరిమితం కావొచ్చని ఫెడరల్‌ రిజర్వ్‌ పేర్కొంది.