లాభాల్లో వాల్‌స్ట్రీట్
యూరప్‌లోని దాదాపు అన్ని మార్కెట్లు నష్టాల నుంచి లాభాల్లోకి వచ్చేశాయి. జర్మనీ డాక్స్ ఒక శాతం నష్టం నుంచి 0.3 శాతానికి తగ్గింది. అమెరికా మార్కెట్లలో ఇవాళ కూడా బాండ్ ఈల్డ్స్ తగ్గడంతో పాటు డాలర్ బలహీనపడింది. డాలర్ ఇండెక్స్ మళ్ళీ 100 దిగువకు వచ్చేసింది. నిన్న నాస్‌డాక్‌తో పాటు అన్ని సూచీలు గ్రీన్‌లో ప్రారంభమై… నష్టాల్లో ముగిశాయి. ఇవాళ నాస్‌డాక్ 1.5 శాతం, ఎస్ అండ్ పీ 500 సూచీ 0.65 శాతం, డౌజోన్స్ 0.45 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. ఇప్పటికే అమెరికాలో ద్రవ్యోల్బణం 40 ఏళ్ళ గరిష్ఠ స్థాయికి చేరింది. ఉక్రెయిన్, రష్యా యుద్ధం తరవాత అమెరికాలో కూడా ఇంధన ధరలు బాగా పెరిగాయి. ద్రవ్యోల్బణం అదుపు తప్పడానికి అదే ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో కూడా క్రూడ్ ఆయిల్ నిన్న, ఇవాళ భారీగా పెరిగింది. 100 డాలర్ల లోపు ఉన్న బ్రెంట్ క్రూడ్ ఇవాళ 107.5 డాలర్లకు చేరింది.