For Money

Business News

నష్టాల్లో ముగిసిన వాల్‌స్ట్రీట్‌

రేపు అమెరికా ఫెడ్‌ సమావేశం కానుంది. కనీసం పావు శాతం వడ్డీని పెంచుతారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టెక్‌, ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి పెరుగుతోంది. ఫెడ్‌ మీటింగ్‌ ముందు కరెన్సీ మార్కెట్లలో తీవ్ర హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. నిన్న రాత్రి ఓపెనింగ్‌ భారీగా క్షీణించిన డాలర్‌ క్లోజింగ్‌కల్లా కోలుకుంది. డాలర్‌ ఇండెక్స్‌ 99పైన ఉంది. నాస్‌డాక్‌ రెండు శాతంపైగా నష్టపోగా ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 0.74 శాతం నష్టపోయాయి. యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి పెద్ద ఐటీ కంపెనీల షేర్లు రాత్రి రెండు శాతంపైగా నష్టంతో ముగిశాయి. క్రూడ్‌ ఆయిల్‌ ధరలు భారీగా క్షీణించడంతో అనేక ఎనర్జీ షేర్లు నష్టపోయాయి. దీంతో ట్రేడింగ్‌ ఆరంభం నుంచి గ్రీన్‌లో ఉన్న డౌజోన్స్‌ ఎలాంటి మార్పులేకుండా క్రితం ముగింపు వద్దే ముగిసింది. రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య చర్చలు ఎలాంటి ఫలితాలు ఇవ్వకపోవడంతో మార్కెట్‌లో ఉత్సాహం కరువైంది.