For Money

Business News

ఏపీ ఈడీబీ ప్రారంభం

మంగళగిరిలోని మయూరి టెక్ పార్క్ భవనంలో ఏపీ ఎకనామిక్ డెవలప్‌మెంట్‌ బోర్డు (APEDB) కొత్త ఆపీస్‌ను ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ఏకైక లక్ష్యం కావాలని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తరవాత రాష్ట్రంలోకి భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25 శాతం మన రాష్ట్రానికే వచ్చాయని చెప్పారు. గూగుల్, ఆర్సెలార్ మిత్తల్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు ఏపీకి రావడాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.