టెక్ షేర్లలో భారీ షార్ట్ కవరింగ్
చాలా రోజుల తరవాత వాల్‌స్ట్రీట్ కళకళలాడుతోంది. భారీగా క్షీణించిన ఐటీ షేర్లలో ఇవాళ షార్ట్ కవరింగ్ వచ్చింది. పైగా కొనుగోళ్ళ మద్దతు కూడా అందడంతో వాల్‌స్ట్రీట్ ‘ఆల్ గ్రీన్’లోకి వచ్చేసింది. నాస్డాక్ ఏకంగా4 శాతంపైగా లాభంతో ట్రేడవుతోంది. ఇక ఎస్ అండ్ పీ 500 సూచి మూడు శాతం దాకా లాభాలతో దూసుకుపోతోంది. డౌజోన్స్ కూడా ఒక శాతంపైగా లాభంతో ఉంది. ట్విటర్ డీల్‌ను తాత్కాలికంగా ఆపేస్తున్నట్లు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించడంతో ట్విటర్ షేర్ పది శాతం దాకా నష్టపోయింది. టెస్లా 8 శాతం లాభంతో ట్రేడవుతోంది. ఇవాళ బాండ్ ఈల్డ్స్ కూడా నాలుగు శాతం పెరిగాయి. డాలర్ స్వల్పంగా క్షీణించింది. డాలర్ ఇండెక్స్ 104.5 వద్ద ట్రేడవుతోంది. ఇక క్రూడ్ కూడా మూడు శాతం దాకా పెరిగింది. బ్రెంట్ క్రూడ్ 111 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మొత్తం మార్కెట్లలో బంగారం ఒక్కటే డల్‌గా స్వల్ప నష్టాల్లో ఉంది. వెండి మాత్రం గ్రీన్‌లో ఉంది.