ట్విటర్ డీల్ రద్దుకు మరో లేఖ
ట్విటర్, ఎలాన్ మస్క్ మధ్య కోర్టు యుద్ధం అక్టోర్ 17 నుంచి ప్రారంభం కానుంది. ఈలోగా ట్విటర్ డీల్‌ను రద్దు చేసుకుంటున్నట్లు ఎలాన్ మస్క్ మరోసారి ట్విటర్‌కు లేఖ రాశారు. ఈసారి ఆయన గత వారం ఓ సెక్యూరిటీ నిపుణుడు చేసిన ఫిర్యాదును జతపర్చారు. ట్విటర్ కంపెనీ స్పామ్‌ను తగ్గించడానికి బదలు తన వినియోగదారుల సంఖ్య పెంచుకునేందుకు ప్రాధాన్యం ఇస్తోందని పీటర్ జట్కో అనే సెక్యూరిటీ నిపుణుడు ఆరోపించారు. తన వద్ద పటిష్టమైన సెక్యూరిటీ ప్లాన్ ఉందని ట్విటర్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఈ లేఖను ఎలాన్ మస్క్ జతచేస్తూ… ఈ కారణాలతో తాను డీల్ నుంచి వెనక్కి వెళుతున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ఒక్కో షేర్‌ను 54.20 డాలర్లకు కొనుగోలు చేసేలా ఎలాన్ మాస్క్‌ను ఆదేశించాలని ట్విటర్ కోర్టులో సవాలు చేసింది.అక్టోబర్ 17 నుంచి ఛాన్సరీ డేలావేర్ కోర్ట్‌లో అయిదు రోజుల విచారణ ప్రారంభం కానుంది.