వరి కనీస మద్దతు ధర రూ.100 పెంపు
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ఇవాళ భేటీ అయిన కేంద్ర కేబినెట్ 17 రకాల పంటల కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) లను ఖరారు చేసింది. ఇవన్నీ ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌కు వర్తిస్తాయి. కేబినెట్ భేటీ వివరాలను కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాగూర్ మీడియాకు తెలిపారు. సాధారణ రకం వరి ధాన్యం కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ.100 పెంచాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే పెసర పప్పు క్వింటాల్ ధర రూ. 480, మినపప్పు క్వింటాలుకు రూ.300 చొప్పున పెంచాలని కేంద్రం నిర్ణయించింది. పొద్దుతిరుగుడు విత్తనాల ఎంఎస్పీ క్వింటాలుకు రూ. 385, నువ్వులు క్వింటాలుకు రూ. 523 చొప్పున పెంచనున్నారు.
ధరల పెంపు.. అన్నీ క్వింటాలుకు
పెసర పప్పు రూ. 480
మినపప్పు రూ.300
సాధారణ వరి రూ. 100
వేరుశనగ రూ. 300
పొద్దుతిరుగుడు విత్తనాలు రూ.385
నైజర్ సీడ్ (వెర్రి నువ్వులు) రూ. 357
మీడియం స్టేపుల్ కాటన్ రూ.354
సోయాబీన్ రూ. 350
కందులు రూ. 300
జొన్నలు హైబ్రిడ్ రూ.232
మొక్కజొన్న రూ.92
నువ్వు రరూ.523
అరహర్ దాల్ (Arhar Dal) రూ. 300
సజ్జ రూ. 100